వ్యవసాయం చేస్తానన్నారు.. ఇప్పుడు ఇదేందీ
Fuel Price Hike: గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి రేట్లను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలను పెంచుతున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త రేట్లు మంగళవారం తెల్లవారుజాము నుంచి అమలులోకి వస్తాయి. ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది.
కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు- రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

అదే సమయంలో గృహావసరాల ఎల్పీజీ వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తోన్న సిలిండర్లపైనా ఈ తాజా వడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పెంపుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలతో కంపేర్ చేశారు. ఈ రేట్లను విశ్లేషించారు. క్రూడాయిల్ రేట్లు భారీగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఏ మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 60 డాలర్ల కంటే దిగువకు చేరిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. రష్యా యురాల్స్ ముడి చమురు రేటు సైతం బ్యారెల్ ఒక్కింటికి 50 డాలర్ల కంటే తక్కువే పలుకుతోందని ఆయన వివరించారు. వాటి రేట్లు తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు బదలాయించాల్సిన అవసకం ఉందని అన్నారు.
దీని ప్రకారం చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ ఒక్కింటికి అయిదు రూపాయల వరకు తగ్గించడానికి అవకాశం ఉందని సాయిరెడ్డి చెప్పారు. పెట్రోల్ రేటు తక్కువగా ఉండటం- దేశ ఆర్థిక పరిస్థితికి ఓ ఉద్దీపనలా పని చేస్తుందని, ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారాయన. దీన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురికి ట్యాగ్ చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications