కుట్రకోటగా కరకట్ట నివాసం; వివేకా హత్యకేసులో సీబీఐ లీకులపై అనుమానం: గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ టిడిపి నేతలు దిగజారి పోతున్నారని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై కూడా టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేయడం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై, చంద్రబాబు పై ధ్వజమెత్తారు.

Recommended Video

    YS Vivekananda Reddy కేసులో CBI దూకుడు, విచారణ మలుపులు | YSRCP | Oneindia Telugu

    కరకట్ట నివాసాన్ని చంద్రబాబు కుట్రకోటగా మార్చాడు

    కరకట్ట నివాసాన్ని చంద్రబాబు కుట్రకోటగా మార్చాడు

    మా మంత్రి చనిపోయిన షాక్ లో మేము ఉంటే ఆయన చనిపోవటంపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసుని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం దుర్మార్గం అంటూ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంటే అడ్డుకోవడం కోసం అనుక్షణం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కూడా కుట్ర కోటగా మార్చాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

     అవినాష్ రెడ్డి మా ఎంపీ .. అందుకే వాస్తవాలు ఏమిటి అని అడుగుతున్నాం

    అవినాష్ రెడ్డి మా ఎంపీ .. అందుకే వాస్తవాలు ఏమిటి అని అడుగుతున్నాం

    వివేకానంద రెడ్డి హత్య విషయంలో అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోందని, దానిని మేము స్వాగతించామని పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి దర్యాప్తులో వాస్తవాలు తెలుసుకోకుండా పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సిబిఐ దర్యాప్తులో మేమెందుకు కల్పింఛుకుంటాం అంటూ అసహనం వ్యక్తం చేశారు . సిబిఐతోక కత్తిరిస్తాం రాష్ట్రం లోకి రానివ్వము అన్న మీరు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు గురించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. అవినాష్ మా ఎంపీ, అతనిపై మీరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం. యధార్ధాలు ఏమిటి అని అడిగే హక్కు మాకు ఉంది అని పేర్కొన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి చనిపోయిన వ్యక్తి మా నాయకుడు చిన్నాన్న మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

     మీరు ఏది చేస్తే మేము అదే చేస్తాం అనుకోవడం మీ భ్రమ

    మీరు ఏది చేస్తే మేము అదే చేస్తాం అనుకోవడం మీ భ్రమ

    సిబిఐ దర్యాప్తులో లీకుల గురించి గడికోట శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ సపోర్ట్ చేయటం లేదని ఎవరినీ నిందించటం లేదని వాస్తవాలను బయటకు తీయాలని మాత్రమే అడుగుతున్నామని పేర్కొన్నారు. మీరు ఏది చేస్తే మేము అదే చేస్తాం అనుకోవడం మీ భ్రమ అంటూ అసహనం వ్యక్తం చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఇక రామ్ సింగ్ పై ప్రభుత్వం కేసు పెట్టిందని మాట్లాడుతున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ 27 జనవరిలో ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ కాలేదని రెండోసారి మళ్ళీ 17వ తేదీ ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. దీనిపై మీరు మాట్లాడటం కోర్టు ధిక్కరణ కాదా అంటూ ప్రశ్నించారు.

    ఎప్పుడూ కుట్రలోనే బతుకుతారు

    ఎప్పుడూ కుట్రలోనే బతుకుతారు


    రామ్ సింగ్ ని హత్య చేసే నైజం మీలాగా మాకు లేదని మండిపడ్డారు. వంగవీటి రంగా, పింగళి దశరథ్ లాంటి వారిని చంపిన ఘనత మీదే అని తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. వివేకానంద రెడ్డి చనిపోయిన బాధలో మేముంటే ఒక జైలర్ రొటీన్ ట్రాన్స్ఫర్ లో వస్తే కూడా నానాయాగీ చేశారని మండిపడ్డారు. టిడిపి నాయకులకు రాజకీయాల్లో హుందాతనమే లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కుట్రలో బతికే బతుకు మీది అంటూ విమర్శలు గుప్పించారు.

     ఎందుకింత దిగజారిపోతున్నారు

    ఎందుకింత దిగజారిపోతున్నారు

    నిత్యం వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారని, ఎందుకు ఇంత దిగజారి పోతున్నారు అంటూ మండిపడ్డారు. సినీ రంగ సమస్యలపై కూడా రాజకీయం చేస్తున్నారని, అవాస్తవాలు మాట్లాడుతున్నందుకు మీపై కూడా కేసు వేయొచ్చు అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సిట్ రిపోర్టు ఏమిచ్చిందో రానివ్వండి అంటూ శ్రీకాంత్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఆరోపణలు చేస్తున్న టిడిపి నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+