గేమ్ ఛేంజింగ్ నిర్ణయం.. వారికోసం.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు తెలిపింది. కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించొచ్చని పేర్కొంది.
నిత్యం హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి వాహనదారుల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు ప్రకటించింది.కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. భారత రోడ్డు, మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. నిత్యం హైవే పై ప్రయాణించే వాహనదారులు, హైవేల పక్కన ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఏళ్లుగా ఈ నిర్ణయం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
"ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫాస్టాగ్ విధానంలో యానువల్ పాస్ విధానం అభినందనీయం. సంవత్సరానికి కేవలం రూ. 3వేలు కావడంతో ఇది వాహనదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. అలాగే హైవేపై ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ ప్రామిస్ ను నితిన్ గడ్కరి నిలబెట్టుకున్నారు. ఇది వారి నిబద్ధత, పట్టుదలకు నిదర్శనం" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
A game-changer for Bharat’s road infrastructure journey
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 18, 2025
A long-standing demand of vehicle owners, especially those from nearby villages and frequent highway commuters, has finally been addressed with this landmark decision.
I wholeheartedly thank Union Minister Sri… https://t.co/02shb45AR4
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే మొదలవుతుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. ఫాస్టాగ్ వార్షిక పాసుల జారీ కోసం త్వరలోనే రాజ్‌మార్గ్ యాత్రా యాప్, NHAI, ఎంఆర్‌టీహెచ్.. తదితర అధికారిక వెబ్‌సైట్లలో లింక్ యాక్టివేట్ అవుతుందన్నారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ వ్యవధిలో దేశంలోని అన్ని హైవేలపై గరిష్ఠంగా 200 ట్రిప్పులు ప్రయాణించొచ్చు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications