అశోక్ గజపతిరాజు సోదరుడు, మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు కన్నుమూత
విశాఖపట్నం: కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
100కు పైగా ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. అంతేగాక, రామతీర్థం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలకు ఆనంద గజపతిరాజు ధర్మకర్తగా ఉన్నారు.












Click it and Unblock the Notifications