మా పాఠశాలే, అందుకే ఎన్టీఆర్, బాబు బాటలో: కెసిఆర్‌పై గాలి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను టీడీపీలో శిక్షణ పొందిన నేతగానే అభివర్ణించారు.
'కేసీఆర్ తెలుగుదేశం పాఠశాలలో చదువుకున్నారు. ఇక్కడే శిక్షణ పొందారు. ఆ వారసత్వం కాబట్టే టీడీపీ అమలు చేసిన కార్యక్రమాలనే అమలు చేస్తున్నారు. ముస్లిం విద్యార్థుల కోసం వంద పాఠశాలలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ పాఠశాలలకు ఆద్యుడు ఎన్టీఆరే. చంద్రబాబు కూడా గతంలో షాదీఖానాలు, దర్గాలు, మసీదుల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులిచ్చారు' అని ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూలు, మత ఘర్షణలు ఉండేవని, టీడీపీ హయాంలో వాటిని పూర్తిగా నిర్మూలించి శాంతి భద్రతలు నెలకొల్పడం వల్లే ఐటీ కంపెనీలు, అనేక పరిశ్రమలు వచ్చి హైదరాబాద్ అభివృద్ధి అయిందని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీని స్థాపించకముందు కెసిఆర్.. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో మంత్రిగానూ విధులు నిర్వహించారు కెసిఆర్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి.. తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీని స్థాపించి విజయవంతయ్యారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications