మహేష్ బాబు, చంద్రబాబు ట్వీట్ల సంభాషణ వెనక ఎవరు?
హైదరాబాద్: మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాపై రాజకీయ నాయకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సామాజిక బాధ్యత నెరవేర్చాలని చెప్పే ప్రయోజనాత్మక సినిమా కావడంతో రాజకీయ నాయకులకు ఈ సినిమా బాగా నచ్చిందని అంటున్నారు. అయితే, శ్రీమంతుడు సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
దానికి మహేష్ బాబు కూడా చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల సంభాషణ వెనక వ్యవహారం ఏమిటనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఆ కాస్తా ప్రతిస్పందించడం వెనక గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఉన్నారనే మాట వినిపిస్తోంది.

గల్లా జయదేవ్ మహేష్ బాబుకు బావ అనే విషయం అందరికీ తెలిసిందే. గల్లా జయదేవ్ చొరవతోనే ఇరువురి మధ్య ట్వీట్ల సంభాషణ సాగినట్లు చెబుతున్నారు. ట్వీట్ చేసేంత తీరిక చంద్రబాబుకు లేదు. రాజకీయాలకు దూరంగా ఉండే మనస్తత్వం మహేష్ బాబుది. పైగా, మహేష్ బాబు తండ్రి కృష్ణ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెసుకు అనుకూలంగా కూడా ఉంటూ వచ్చారు. ఈ స్థితిలో చంద్రబాబుకు మహేష్ బాబును దగ్గర చేయడానికి గల్ల జయదేవ్ ఓ చేయి వేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మహేష్ బాబు ఇటీవల తెంలగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత మేలు జరిగేలా మహేష్ బాబును దగ్గర చేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications