విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు మరో షాక్, టిడిపిలోకి గండి బాబ్జీ: కొణతాల కూడా చేరేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా రు. విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు గండి బాబ్జీ కూడా ఈనెల 28న సైకిల్‌ ఎక్కునున్నారు. వీరిద్దరూ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్య శిష్యులు కావడం విశేషం.

వైయస్ రాజశేఖర రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన కొణతాల వైసీపీలో కీలక స్థానానికి ఎదిగారు. పలు పరిణామాల నేపథ్యంలో కొణతాలను పార్టీ నుంచి జగన్‌ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో కొణతాల, గండి బాబ్జీ, కిడారి టీడీపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

 Gandi Babji to join in TDP: Konathala may also join

కొణతాల చేరిక విషయంలో జాప్యం జరుగుతుండడంతో ఆయనతో సంబంధం లేకుండానే కిడారి, గండి బాబ్జీ టీడీపీలే చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలో కొణతాల కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి తప్పు చేశానని పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో వైసీపీలో చేరినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు.

పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, రెండేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే వైసీపీలో చేరి తప్పు చేశానని అనిపించిందని అన్నారు. అందుకే నెల్లూరు జిల్లా సమన్వయ కమిటీ పదవికి రాజీనామా చేసి లేఖను జగన్‌కు పంపానని, త్వరలోనే టీడీపీలో చేరతానని చెప్పారు.

English summary
YSR Congress party leader Gandi Babji may join in Telugu Desam party along with Saraswera Rao soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X