భారీ గణేషుడి నిమజ్జనం, తెలంగాణ లంబోదర(పిక్చర్స్)
హైదరాబాద్: తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు సాగరంలో నిమజ్జనం అయ్యాడు. ఇంటి వద్ద, అపార్టుమెంట్లలో, కార్యాలయాల్లో పూజలు అందుకున్న గణనాథులతో పాటు బాలాపూర్, ఖైరతాబాద్ తదితర భారీ ఏకదంతుల నిమజ్జనం పూర్తయింది.
గణేష్ నిమజ్జనం హైదరాబాదు హుస్సేన్ సాగర్‌లో గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర బుధవారం అర్ధరాత్రి రెండు గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం పూర్తయింది.
వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు ఆకట్టుకున్నాయి. వీర హనుమాన్, గబ్బర్ సింగ్, అన్నాహజారే, కృష్ణుడు... ఇలా తదితర రూపాల్లో ఆకట్టుకున్నాయి. వాటిని తీసుకు వచ్చిన వాహనాల అలంకరణ అద్భుతంగా ఉంది.

ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర దృశ్యం. ఈ గణేషుడు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనమయ్యాడు.

నిమజ్జనం
భారీ ఖైరతాబాద్ గణనాథుడిని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

తరలి వచ్చిన భక్తులు
భారీ ఖైరతాబాద్ గణనాథుడిని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.

గురువారం
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుల నిమజ్జనం గురువారం రాత్రి వరకు కొనసాగింది. బుధవారం వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది.

తెలంగాణ గణేష్
తెలంగాణ మద్దతుదారులు జై బోలో తెలంగాణ అంటూ ఏర్పాటు చేసిన వాహనంలో మట్టి వినాయకుడిని నిమజ్జనం కోసం తీసుకు వస్తున్న దృశ్యం.

నేతలు
గణేషుడి నిమజ్జనం సందర్భంగా తెలంగాణ మద్దతుదారుల వాహనంలో మోడీ, సుష్మా స్వరాజ్, అద్వానీ, వాజపేయి, బండారు దత్తాత్రేయల చిత్రాలు.












Click it and Unblock the Notifications