వల్లభనేని వంశీ పరార్? ఫోన్ స్విచ్ ఆఫ్. అనుచరులతో కలిసి అండర్‌గ్రౌండ్‌లోకి!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఇటీవల మరో కేసు నమోదైన విషయం తెలిసిందే.. డిశెంబర్ 18న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సైతం ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య సమస్యలతో దూరంగా ఉన్నారని కార్యకర్తలంతా భావించారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అయ్యింది.
11 కేసుల్లో నిందితుడు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వంశీ ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. పలు కేసుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ జైలుకు కూడా వెళ్లి అతి కష్టంపై బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో అయన ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిశెంబర్ 1న వంశీపై మరో కేసు నమోదు కావటం ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో..
అయితే రెండ్రోజులగా వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారని టాక్ గన్నవరంలో గుప్పుమంది. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో ఆయన కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల మాచవరం స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.2024 జూన్ 7న సునీల్‌పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని.. దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపర్చారన్నది నేరాభియోగం నమోదు కాగా.. నిందితులుగా యతీంద్ర రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం.బాబు, ముల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి, మరికొంతమందరున్నారు.
కోర్టుకు డుమ్మా..
ఈ నెల 23న మాచవరం పోలుసులు సమన్లు ఇచ్చేందుకు వంశీ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లినా అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 29న విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆయన అనుచరులు కూడా వాయిదాకు రాలేదు. అంతా కలిసి పరారయ్యారన, వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications