కడపపై జగన్‌కు గంటా ఝలక్, 'చిరంజీవి పీఆర్పీలాగే వైసిపినీ మూసేస్తారు'
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇలాకా అయిన కడపలో టిడిపి బలంగా ఉందని, పైగా వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ ఉంటుందని చెబుతున్నారు.
మంత్రులు గంటా శ్రీనివాస రావు, యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు మాట్లాడారు. కడపలో టిడిపికి స్పష్టమైన ఆధిక్యంతో పాటు వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ తప్పకుండా జరుగుతుందన్నారు.

ఇతర జిల్లాల్లో వైసిపికి బలం లేకపోడవం వల్లనే పోటీకి దిగలేదని చెప్పారు. వైసిపి కడపకే పరిమితమైన పార్టీ అన్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని మూసివేసినట్లే జగన్ కూడా వైసిపిని మూసేస్తారని ఎద్దేవా చేశారు.
స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి అభ్యర్థుల జాబితాను టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఖరారు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications