చేతులు కలిపిన ఏపి, టి మంత్రలు: చర్చలు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావుల భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అసంపూర్తిగా ముగిసింది. ఇరువురు మంత్రుల ప్రతిపాదనలపై ఎలాంటి ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరికి మరోమారు కూర్చుని చర్చించుకోవాలని నిర్ణయించారు. అనేక ప్రతిపాదనలు ఇరువురి మధ్య వచ్చినా, దేనిపైనా ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. సోమవారం సాయంత్రం ఇంటర్మీడియట్ కమిషనరేట్‌లో ఇరువురు మంత్రుల భేటీ జరిగింది.

భేటీ అనంతరం తెలంగాణ విద్యా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇకనుంచి తమ రాష్ట్రానికి సంబంధించి పరీక్షలు తామే నిర్వహించుకుంటామని అన్నారు. జాతీయ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇంటర్ మార్కుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించినా ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డులో ఏ అధికారులు ఎవరిమాట వినాలనే విషయంలో అయోమయం ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంటర్ సిలబస్‌లో చేర్పులు, మార్పులు చేస్తామని వెల్లడించారు.

ఏపి, టి మంత్రుల భేటీ

ఏపి, టి మంత్రుల భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావుల భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అసంపూర్తిగా ముగిసింది.

ఏపి, టి మంత్రుల భేటీ

ఏపి, టి మంత్రుల భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావుల భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అసంపూర్తిగా ముగిసింది.

ఏపి, టి మంత్రుల భేటీ

ఏపి, టి మంత్రుల భేటీ

ఇరువురు మంత్రుల ప్రతిపాదనలపై ఎలాంటి ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరికి మరోమారు కూర్చుని చర్చించుకోవాలని నిర్ణయించారు.

ఏపి, టి మంత్రుల

ఏపి, టి మంత్రుల

అనేక ప్రతిపాదనలు ఇరువురి మధ్య వచ్చినా, దేనిపైనా ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. సోమవారం సాయంత్రం ఇంటర్మీడియట్ కమిషనరేట్‌లో ఇరువురు మంత్రుల భేటీ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ.. విభజన చట్టం మేరకే ముందుకెళ్తామని అన్నారు. వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి గంటా వెల్లడించారు. ఎంసెట్, ఇతర పరీక్షల నిర్వహణకు సంబంధించి కొంత సందిగ్ధత ఉందని పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్ష ఉమ్మడిగానే ఉంటుందని స్పష్టం చేశారు.

ఉమ్మడి పరీక్షల్లో విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఆలస్యం కావద్దని తమ అభిప్రాయమని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూలులో పేర్కొన్న విద్యాసంస్థల విభజనపై తీసుకోవల్సిన చర్యలపై వీరు చర్చించారు. ఇంటర్మీడియట్ బోర్డు విభజనకు ఇరువురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. వచ్చే పరీక్షల్లో ఒకే ప్రశ్నాపత్రాన్ని వినియోగించాలని, అయితే వాల్యూయేషన్ మాత్రం ఎవరికి వారు చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+