ఎవరికీ తెలియదు, పవనే చెప్పారు: గంటా, తప్పుగా అర్థం చేసుకొని: 175 సీట్లపై జనసేన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు ఆచితూచి స్పందించారు. ఆయన విశాఖలో మాట్లాడారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు ఆచితూచి స్పందించారు. ఆయన విశాఖలో మాట్లాడారు.

ఏ పార్టీ, ఎక్కడి నుంచి ఎన్ని సీట్లో.. పవన్‌కు గంటా కౌంటర్
పవన్ కళ్యాన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు కానీ అందుకు చాలా సమయం ఉందని గంటా స్పష్టం చేశారు. ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
Recommended Video


పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు
పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఏమిటో తెలియాల్సి ఉందని గంటా చెప్పారు. ఉద్దానం, వ్యవసాయ విద్యార్థులు.. ఇలా నాలుగైదు సమస్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. దీంతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమని పవన్ కూడా చెప్పారన్నారు.

పవన్ కళ్యాణ్ కాదు.. జనసేన ట్విట్టర్ అకౌంట్‌లో
ఇదిలా ఉండగా, జనసేన ట్విట్టర్ ద్వారా 175 స్థానాల్లో పోటీ చేస్తామని ట్వీట్ రావడం, ఆ తర్వాత తొలగించడంపై జనసేన స్పందించింది. అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారని కొందరు చెప్పారు. కానీ పవన్ ట్వీట్ చేయలేదని తేల్చి చెప్పారు. జనసేన ట్విట్టర్ అకౌంట్‌లో మాత్రం ట్వీట్ వచ్చిందని, అందుకు కారణం కూడా ఆ పార్టీ తెలిపింది.

ఆ వ్యక్తి పొరపాటు ట్వీట్
దీనిపై జనసేన మీడియా ప్రతినిధులు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలో పోటీ చేయాలన్న అంశంపై ప్రస్తుతం పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదని, పార్టీ సోషల్ మీడియా గ్రూపులో కొత్తగా చేరిన వ్యక్తి పొరపాటున ఆ విధంగా ట్వీట్ చేశారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకొని
జనసేన సోషల్‌మీడియా విభాగమైన శతఘ్ని డిజిటల్ రెజిమెంట్ ప్రతినిధుల సమావేశం కొన్ని రోజుల కిందట జరిగింది. దానిలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆ ప్రతినిధుల్లో ఒకరు వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా? అని అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ బదులిస్తూ.. అప్పటి పరిస్థితుల్నిబట్టి, పార్టీ బలాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని బదులిచ్చారు. దాన్నే ఆ బృందంలోని ఒక వ్యక్తి పొరపాటుగా అర్థం చేసుకుని ఇప్పుడు ట్వీట్ చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications