పవన్ తో పొత్తు - విశాఖ రాజధానిపై గంటా కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు ..మాజీ మంత్రి కన్నాతో సమావేశమయ్యారు. ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గంటా పార్టీ నేత పుల్లారావుతో కలిసి కన్నాతో సమావేశమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కన్నా..గంటా మంత్రులుగా పని చేసారు. ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో పొత్తులు..సీట్ల గురించి గంటా కీలక వ్యాఖ్యలు చేసారు. ఉత్తరాంధ్రలో వచ్చిన ఫలితాల పైన కొత్త విశ్లేషణ చేసారు. పవన్ కల్యాణ్ ..తమ ఆలోచనలు..లక్ష్యంగా ఒకటేనని స్ఫష్టం చేసారు. మూడు రాజధానుల అంశంపైనా గంటా స్పందించారు.

కొంత కాలంగా గంటా శ్రీనివాస రావు తిరిగి టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల తరువాత పవన్ కోరుకున్న విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఒకే పార్టీకి పోలయ్యాయని చెప్పుకొచ్చారు. ఫలితంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం సాధించిందని చెప్పారు. ఇక, పట్టభద్రుల ఫలితాలతో విశాఖ రాజధాని నిర్ణయానికి మద్దతు లేదని తేలిపోయిందని గంటా ఈ రోజు వ్యాఖ్యానించారు. అమరావతికే ప్రజలంతా మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా టీడీపీకి అనుకూల ఫలితాలు ఖాయమని గంటా పేర్కొన్నారు.

Ganta Srinivasa Rao made interesting comment on Alliance with Janasena

పొత్తులు..సీట్ల అంశం ఎన్నికల సమయంలో స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీపైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని...టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని గంటా వివరించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధను అభ్యర్దిగా గంటా ప్రతిపాదించారు. అయితే, పోలింగ్ సమయంలో గంటా రాజీనామా ఆమోదించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కొద్ది కాలం క్రితం వరకు గంటా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్ ను తాజాగా పాదయాత్రలో కలిసిన తరువాత గంటా..పార్టీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. అటు పవన్ ను సమర్దిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+