Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే?

అమరావతి/విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీ సర్కారు తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.

ఈ ఘటనతో సీఎం జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మాజీ మంత్రి గంటా ఎద్దేవా చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Ganta srinivasa rao on his mla resignation approval issue

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ రాజీనామా పెండింగ్‌లోనే ఉంది. అయితే, తాజాగా, మంగళవారం స్పీకర్.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు.

గతంలో తాను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడమేంటని గంటా శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని విమర్శించారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని జగన్ కు అనుమానం పట్టుకుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి గంటా.

రాజకీయ లబ్ధికోసమే తన రాజీనామాను ఆమోదింపజేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అని గంటా శ్రీనివాసరావు నిలదీశారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయాలనుకున్నట్లు తెలిపారు. రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+