Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీటు రాకపోతే పార్టీ మారుతారు - గంటా వ్యాఖ్యల వెనుక..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల ఖరారు వేళ సీనియర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ముఖ్య నేతల సీట్లు గల్లంతు అవుతున్నాయి. మరి కొందరికి నియోజకవర్గాల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించింది. దీని పైన గంటా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

గంటా వ్యాఖ్యలు : గంటా శ్రీనివాసరావు తన మనసులో మాట బయట పెట్టారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ తనకు సూచించిందని చెప్పుకొచ్చారు. తనకు విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలని ఉందని స్పష్టం చేసారు. తాను ఇంతకాలం విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తు వచ్చానని గుర్తు చేసారు.

Ganta Srinivasa Rao Reacts over his contest against Minister Botsa in Cheepurupalli

ఇప్పుడు చీపురుపల్లి 150 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. పార్టీ ఆలోచించి తన నిర్ణయం చెప్పమందని చెప్పుకొచ్చారు. తాను తన మద్దతు దారులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు. చీపురుపల్లిలో మంత్రి బొత్సా పైన పోటీ కోసం తనను అక్కడకు పంపాలని పార్టీ భావిస్తుందని వివరించారు. పరోక్షంగా గంటా పార్టీ ప్రతిపాదనకు సుముఖంగా లేననే సంకేతాలు ఇచ్చారు.

సీటు మార్పు ఖాయమా : ఇదే సమయంలో సీట్లు రాని వారు పార్టీ మారటం సహజమని చెప్పుకొచ్చారు. వైసీపీలో నేతల పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీలో సీటు లేదని చెప్పటంతోనే కేశినేని శ్రీనివాస్ పార్టీ వీడారని గంటా చెప్పుకొచ్చారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడారని..ఎంపీ సీటు ప్రతిపాదించినా ఆదిమూలం వద్దని పార్టీ నుంచి బయటకు వచ్చారని గంటా చెప్పుకొచ్చారు.

టీడీపీ మరో వారం రోజుల్లో అభ్యర్దులను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చల దశలోనే ఉందని..తుది నిర్ణయం జరగలేదన్నారు. తాను విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు గంటా పరోక్షంగా వెల్లడించారు. సీటు రానప్పుడు పార్టీ మారటం పెద్ద విషయం కాదంటూ గంటా చేసిన వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Ganta Srinivasa Rao Reacts over his contest against Minister Botsa in Cheepurupalli

గంటా నిర్ణయం ఏంటి : గంటా చాలా కాలంగా విశాఖ నుంచే గెలుస్తూ వచ్చారు. 1999లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంటా.. 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేసారు. చిరంజీవితో గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014లో టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి గా వ్యవహరించారు.

2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్ బీజేపీకి వెళ్లనుంది. దీంతో, టీడీపీ నుంచి చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు సూచించారు. గంటా భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో, గంటా పార్టీ సూచన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+