నాటు నాటు సాంగ్ పై గరికపాటి వ్యాఖ్యలు వైరల్..!!
నాటు నాటు పాటపై గరికపాటి చేసిన విశ్లేషణ ఇప్పుడు వైరల్ అవుతోంది
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఈ సూపర్ హిట్ సాంగ్ నాటు నాటు ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ నెల 13న ఆస్కార్ అవార్డుల బరిలో ఖచ్చితంగా ఈ పాట నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పాటను ఆస్కార్ నామినేట్ కావటంతో ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. కొరియన్లు సైతం ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. జూ ఎన్టీఆర్ - రాంచరణ్ ఇమేజ్ పెరిగిపోయంది. దర్శకుడు రాజమౌళి.. కీరవాణి పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం పైన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ అవార్డులు ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్ పాటకు అవార్డు వస్తుందని..రావాలని అందరూ కోరుకుంటున్నారు. దీని పైన స్పందించిన గరికపాటి జూ ఎన్టీఆర్ - రం చరణ్ పైన ప్రశంసలు కురిపించారు.ఆ పాటకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో తెలుసుకొనేందుకు తాను ఆ పాట విన్నట్లుగా వివరించారు. నాటు నాటు పాట అచ్చమైన తెలుగు పాటగా పేర్కొన్నారు. అందులో ఎక్కడా ఒక ఇంగ్లీషు పదం కూడా లేదని చెప్పారు. చంద్రబోస్ చక్కగా పాట రాసారని అభినందించారు. ఈ పాటకు కీరవాణి సంగీతం.. రాజమౌళి దర్శకత్వం ఈ ఇద్దరి హీరోల ప్రతిభ కలిసి ఆస్కార్ అవార్డు దిశగా నడిపించిందని పేర్కొన్నారు. ఈ పాటకు ప్రపంచ స్థాయి బహుమతి ఖచ్చితంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. మార్చి 13వ తేదీన ఆస్కార్ రావాలని అందరం కోరుకుందామని గరికపాటి పిలుపునిచ్చారు.

ఇక..ఈ పాట కోసం జూ ఎన్టీఆర్ - రాం చరణ్ నటన పైన గరికపాటి ప్రశంసలు కురిపించారు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి అద్భుత నటన ప్రదర్శించారన్నారు. తన కంటే ఆ ఇద్దరు వయసులో చిన్న వారైనా ఆ ఇద్దరికీ నమస్కారం చేస్తున్నట్లు గరికపాటి పేర్కొన్నారు. కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదని విధంగా తారక్ - చెర్రీ కూడ బలుక్కుని చేసారనే విధంగా వారి నటన ఉందని ప్రశంసించారు. ఆస్కార్ అవార్డు వస్తే మనమంతా గర్వంగా తిరుగుతామని చెప్పుకొచ్చారు. ఇలా.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావాలని సినీ అభిమానులు అంతా కోరుకుంటున్నారు. ఇదే సమయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు..చేసిన విశ్లేషణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications