TTD: వైభవంగా గరుడసేవ - భక్తులకు దేవదేవుడి సాక్షాత్కారం..!!
Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనం(Garuda Vahanam)పై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది. అర్ద్రరాత్రి వరకు సాగింది.వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
భారీగా భక్తులు : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ(Garuda Vahana Seva)ను దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. ఉదయానికల్లా గ్యాలరీలు భక్తులతో నిండాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది.

తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడవీధుల్లో గల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశముంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసారు. భారీగా తరలి వచ్చిన భక్త జనంతో తిరుమల(Tirumala) గిరులు గోవింద నామంతో మార్మోగాయి.
భక్తులకు సాక్షాత్కారం : విశిష్ఠమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకర కంఠి, లక్ష్మీహారం, సహస్రనాయ కాసుల మాల, సుదర్శన చక్రమాల, మూల విరాట్ కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్ఫమాల, చెన్నై నూతన ఛత్రాలను అలంకరించారు. తన నిత్య సేవకుుగరుత్మంతుడిపై దేవదేవుడి వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమించారు.
ఉదయం స్వామి వారు మోహిని అవతారంలో భక్తులను సాక్షాత్కరించారు. శ్రీవారు(Srivari) మోహినీ రూపంలో దంత పల్లికపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నిక్రిష్ణుడితో కలిసి భక్తి కోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరధం పై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పుర వీధుల్లో ఊరేగనున్నారు.

పులకరించిన భక్తజనం : గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్ గోవింద నిలయం వార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండో సారి రీఫిల్లింగం చేసి భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్,రాం భగీచా, నందకం గెస్ట్ హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు.
దీంతో, భక్తులు ఎవరూ ఇబ్బందులు లేకుండా కొండ మీదకు చేరుకొని గరుడ వాహన సేవను వీక్షించారు. టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి గ్యాలరీల్లో భక్తులతో మమేకం అయి టీటీడీ ఏర్పాట్ల పైన వాకబు చేసారు. బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) కీలకఘట్టం అయిన గరుడసేవ(Garuda seva) భక్తులకు అరుదైన అనుభూతిని పంచింది.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications