ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద: బుడమేరు ఉగ్రరూపంపై కలెక్టర్ క్లారిటీ: ఫోన్ నంబర్ ఇదే..
Prakasam Barrage: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ ఎత్తారు అధికారులు.

దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోన్న కొద్దీ వరద నీటి దిగువకు వదిలివేస్తోన్నారు.
ఈ తెల్లవారు జాము నాటికి ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే.. అంటే మొత్తం 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తోన్నారు. 15 గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తారు. మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వస్తోన్న వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు.
కృష్ణా తూర్పు కాలువ, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానెల్ కు నీటిని విడుదల చేశారు. ఈ వరద ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ఘాట్ల వద్ద స్నానం చేయడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని సూచించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తినందున కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కాగా- గత ఏడాది తరహాలో బుడమేరు మళ్లీ ఉప్పొంగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్మీశ స్పందించారు. అందులో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని కోరారు. బుడమేరు వరద ముప్పును 24 గంటల పాటు పరిశీలిస్తోన్నామని తెలిపారు.
ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వెలిగల్లు రెగ్యులేటర్ వద్దకు వరద ప్రవాహం ఇంకా చేరుకోలేదని పేర్కొన్నారు. బుడమేరు పొడవునా వరద ప్రవాహ తీవ్రతను జాగ్రత్తగా పరిశీలిస్తోన్నామని, ఇప్పుడున్న నీళ్లు వర్షం వల్ల చేరుకున్నవేనని వివరించారు. పులివాగు నుంచి వరద నీరు రాలేదని స్పష్టం చేశారు.
బుడమేరుకు వరదలు ప్రచారం పట్ల స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ#GLakshmisha #NTRDistrict #Budameru #BudameruFloods #AndhraPradesh #ApFloods #ApRains #OIUpdates #Oneindia #Oneindiatelugu pic.twitter.com/qOSe5P82w4
— oneindiatelugu (@oneindiatelugu) August 14, 2025
విజయవాడకు బుడమేరు వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదని, అలాంటి పరిస్థితే వస్తే 24 గంటల ముందే అందరినీ అలర్ట్ చేస్తామని లక్ష్మీశ పేర్కొన్నారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తరువాతే వరద నీటిని బుడమేరుకు విడుదల చేస్తామని చెప్పారు. వరద ప్రవాహంపై జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9154970454 నంబర్ కు ఫోన్ చేయవచ్చని అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications