పీఎస్‌లో ఎమ్మెల్యే గౌతంరెడ్డి అనుచరుల వీరంగం: కానిస్టేబుల్‌పై దాడి

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచరులు మారణాయుధాలతో వచ్చి కలకలం సృష్టించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజెర్ల పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకోవడం గమనార్హం.

అక్రమంగా తెల్లరాయిని తరలిస్తోన్న కేసులో ఆదివారం రాత్రి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వారిని విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Gautam Reddy followers attacked on constable

అంతేగాక, వారికి అడ్డువచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినట్లు తెలిసింది. అయితే, పోలీసులు అరెస్ట్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదలకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that YSRCP MLA Gautam Reddy followers attacked on constable on Sunday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి