ఏపీ మంత్రులను కలవాలంటే - ఎవరెక్కడ, ఇలా..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువరు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ రోజు బాధ్యతల స్వకరణతో పాటుగా ఉన్నతాధికారులతో ప్రత్యేకం గా సమావేశం అవుతున్నారు. ఏపీలో గత అయిదేళ్ల కాలంలో సాగిన పాలనకు భిన్నంగా పూర్తిగా ప్రజాపాలన అందిస్తామని ప్రకటించారు. అమరావతి సచివాలయంలో తిరిగి సందడి మొదలైంది. మంత్రుల కార్యాలయాలు ఖరారయ్యాయి. ఎవరెక్కడ అందుబాటులో ఉంటారో ప్రకటించారు.

కొలువు తీరిన పాలన
ఏపీలో పూర్తిగా ప్రజా పాలన అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు..పవన్ హామీ ఇచ్చారు. రాజధానుల వివాదంతో సీఎం, మంత్రులు సహా ఎవరూ గత ప్రభుత్వ హాయంలో సచివాలయంలో అందుబాటు లో లేరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తిరిగి అమరావతి వేదికగా సచివాలయం నుంచే పాలన అందిస్తోంది. గతంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మధ్నాహ్నం నిర్ణీత సమయంలో సచివాలయం కు వచ్చేవారు. ఇప్పుడు తిరిగి పాత విధానం అమలు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు ఖరారు చేసారు. ఎవరు ఎక్కడ ఉండేదీ ప్రకటించారు.

GDA finalised AP ministers Chambers in Secretarait at Amaravati details here

ఛాంబర్లు ఖరారు
సచివాలయంలో మొత్తం 5 బ్లాకులు ఉన్నాయి. అందులో మొదటి బ్లాక్ లో సీఎంవో కార్యాలయం..సీఎస్ ఆఫీసు ఉంటాయి. బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్ రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణ, రూ నెంబర్ 136 - వంగలపూడి అనిత, రూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి కు కేటాయించారు. అదే విధంగా.. ఫస్ట్ ఫ్లోర్ లో రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్, 211 - పవన్ కల్యాణ్, 212 - పయ్యావుల కేశవ్, రూం నెంబర్ 215 - నాదెండ్ల మనోహర్ కోసం ఖరారు చేసారు. బ్లాక్ - 3, ఫస్ట్ ఫ్లోర్ రూం నెంబర్ 203 - గొట్టిపాటి రవి కుమార్, 207 - కొల్లు రవీంద్ర,210 - డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, 211 - గుమ్మడి సంధ్యారాణి, 212 - మహ్మద్ ఫరూక్ కోసం కేటాయించారు.

ఎవరెక్కడ
అదే విధంగా.. బ్లాక్ - 4, గ్రౌండ్ ఫ్లోర్ లోని రూం నెంబర్ 127 - అనగాని సత్య ప్రసాద్, 130 - కింజరాపు అచ్చెన్నాయుడు, 131 - ఎస్. సవిత,132 - టీజీ భరత్, ఫస్ట్ ఫ్లోర్ లోని రూం నెంబర్ 208 - నారా లోకేశ్, 210 - మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, 211 - కొలుసు పార్థసారథి, 212 - నిమ్మల రామానాయుడు ఉంటారు. బ్లాక్ - 5, గ్రౌండ్ ఫ్లోర్ రూం నెంబర్ 188 - బీసీ జనార్థన్ రెడ్డి,191 - కొండపల్లి శ్రీనివాస్, అదే బ్లాక్ లోని ఫస్ట్ ఫ్లోర్
రూం నెంబర్ 210 - వాసంశెట్టి సుభాష్, 211 - సత్య కుమార్ యాదవ్ కోసం కేటాయింపు పూర్తయింది. ఇక..ఈ నెల 24న ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం జరగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+