చంద్రబాబును కలిసిన గిడ్డి ఈశ్వరి, ఇతర వైసీపీ నాయకులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గం శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గం శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఆయనను కలిసిన వారిలో ఈశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

గిడ్డి చేరుతారని చాలా రోజులుగా ప్రచారం
కాగా, వైసీపీ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ రోజు గిడ్డి.. చంద్రబాబును కలిశారు. ఈశ్వరి టీడీపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను ఆమె తొలుత కొట్టివేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఇటీవల మాత్రం మౌనం వహించారు.

అప్పుడే చేరిక ఖాయమైంది
ఆదివారం ఆమె వైసీపీ అధినేత జగన్ పైన మండిపడ్డారు. అనంతరం టీడీపీలో చేరే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. సాయంత్రమే ఆమె, పలువురు నేతలు అమరావతికి బయలుదేరారు. దీంతో ఆమె చేరిక ఖాయమైంది.

చంద్రబాబును కలిశారు
గిడ్డి ఈశ్వరి సోమవారం ఉదయం చంద్రబాబును కలిశారు. దీంతో ఆమె టీడీపీలో చేరినట్లుగా భావించవచ్చు. ఇటీవల ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరకుండా మద్దతు ప్రకటించారు. రాజీనామా చేయాల్సి వస్తుందని కొత్తగా మద్దతు అంటునన్నారు. ఇప్పుడు గిడ్డి ఈశ్వరి కూడా చేరుతారా, మద్దతు అంటారా చూడాల్సి ఉంది.

టీడీపీ సంప్రదింపులు
ఇదిలా ఉండగా, వైసీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు టీడీపీ వర్గాలు పదేపదే చెబుతున్నాయి. గిడ్డి ఈశ్వరి చేరికపై కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇతర నేతలతోను సంప్రదింపులు జరుపుతున్నారు.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications