ముందు తెలుసుకో: పవన్ కళ్యాణ్‌ను దుమ్ముదులిపిన గిడ్డి ఈశ్వరి, దిమ్మతిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్
Recommended Video

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పవన్ విశాఖలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు.
గిరిజనుల గురించి, ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్న పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మన్యం అభివృద్ధి చెందింది అంటే అది చంద్రబాబు పెట్టిన భిక్షే అన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.

సినిమాల్లో హిట్స్ కొట్టలేక పర్యటిస్తున్నారు
మన్యంలో ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని గిడ్డి ఈశ్వరి అన్నారు. పవన్ కళ్యాణ్‌కు సినీ రంగంలో అనుభవం ఉంటే ఉండొచ్చు కానీ, రాజకీయ రంగంలో మాత్రం పరిపక్వత సాధించలేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో హిట్స్ కొట్టలేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు.

నటుడు కాబట్టి జనాలు వస్తున్నారు
పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కాబట్టి ఆయనను చూసేందుకు చాలామంది జనాలు వస్తున్నారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. అంతే తప్ప రాజకీయంగా ఆయనను సమర్థించేందుకు కాదని అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాజకీయ పరిపక్వత ఏమాత్రం లేదన్నారు. పవన్ వేసవి విడిదికి విశాఖ వచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.

పవన్ కళ్యాణ్ మొదట అది తెలుసుకో
2014 అనంతరం విశాఖ మన్యం అభివృద్ధి చెందిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మొదట తెలుసుకోవాలని ఈశ్వరి హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలపై పవన్‌కు ప్రేమలేదన్నారు. పాడేరులో సభ ఏర్పాటు చేసిన ఆయన, పక్కనే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు పూలమాల కూడా వేయకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. మన్యంపై అవగాహన లేని గిరిజనుల గురించి మాట్లాడటం విచారకరం అన్నారు.

టీడీపీపై నిరాధార ఆరోపణలు
పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసమే టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఈశ్వరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ, అవినీతి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రూ.4 కోట్లుతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
-
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications