కూతురిని కొన్న దంపతులు: రేటు రూ. 10 వేలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పిల్లలను అమ్మకానికి పెడుతున్న వైనం వెలుగు చూసింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో దంపతులు తమ 18 ఏళ్ల కూతురిని విక్రయించారు. తమ కూతురిని అమ్మిన దంపతులను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు.

ఆడబిడ్డను కొన్న మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురిని అమ్మిని మహిళను కమిలిగా గుర్తించారు. ఆమె మాజీ వైస్ సర్పంచ్ కూడా. కాంగ్రెసు పార్టీతో ఉండేది.

ఆడబిడ్డను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు కొన్నట్లు దేవరకొండ డివిజన్ డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ జి. చంద్రమోహన్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. బేబీని విముక్తి చేసి, పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

 Girl child being sold in Telangana for Rs 10,000, couple arrested

కమిలి పది వేల రూపాయలకు ఆడపిల్లను అమ్మినట్లు తెలుస్తోందని, గతంలో కూడా ఆమె పిల్లలను విక్రయించినట్లు తెలుస్తోందని, ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో మరో ఇద్దరు, ముగ్గురు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేవరకొండ శిశు గృహకు చెందిన ఆడపిల్లను ఆమె విక్రయించినట్లు తెలుస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+