ప్రియుడితో పెళ్లికోసం యువతి మౌనపోరాటం.. ముఖం చాటేసిన ప్రియుడు
తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడి కోసం పోరాటానికి దిగింది యువతి. తనతో పెళ్లి చేయాలని ప్రేమికుడి ఇంటి ముదు ఆందోళనకు చేపట్టింది. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని , పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి వాపోయింది. తీరా పెళ్లి చేసుకోమని అడడగా.. ఇప్పడు ముఖం చాటేస్తున్నాడని ఆవేదన వెల్లబుచ్చింది.

గత రెండేళ్లుగా ప్రేమాయణం
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన బోనం రామానుజమ్మ అనే యువతి అదే గ్రామానికి చెందిన తన బావయైన అడబాల సుబ్బరావుతో గత రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తుంది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని పేర్కొంది. అయితే ఇప్పుడు తన భావ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఈవిషయం మలికిపురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు తన భావతో ఎలాగైనా పెళ్లి చేయించాలని వేడుకుంది..

ప్రియుడి ఇంటి ముందు యువతి దీక్ష
అటు కేశనపల్లిలో తన బావ అడబాల సుబ్బారావు ఇంటి ముందు యువతి దీక్షకు దిగింది. తనకు తన బావ కావాలని అతనినే పెళ్లి చెసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. బావ ఇంటి ముందు మౌన పోరాటం కొనసాగిస్తుంది. పెళ్లి చెసుకుంటానని చెప్పేవరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపింది. ఇదే విషయంపై ఎస్ఐ హరికోటి శాస్త్రికి తన బావతో పెళ్లి చేయించాలని వినతిపత్రం ఇచ్చింది.

పోలీసుల కౌన్సిలింగ్.. ప్రేమించలేదంటున్న బావ
ఈ విషయంపై మలికిపురం ఎస్ఐ హరికోటి శాస్తి మీడియాకు వివరిస్తూ .. తానూ తన ఉన్నతాధికారులు కలిసి వారిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ సుబ్బారావు ఆ అమ్మాయిని ఆసలు ప్రేమించలేదని చెప్పాడని ఎస్ఐ తెలిపారు. అయితే ఈ విషయంలో రామానుజమ్మ తన బావపై ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా అంగీకరించడంలేదని పేర్కొన్నారు. దీంతో మలికిపురం పోలీసులకు ఈవిషయంపై ఏం చేయాలో తెలయని పరిస్థితి నెలకొంది .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications