4 రోజులు గదిలో బంధించి ముగ్గురు యువకులు అత్యాచారం, హత్య
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. దాదాపు పదిహేను రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలికను ముగ్గురు యువతులు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
సదరు యువతి గత నెల 19వ తేదీన బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఫోన్ కాల్ అధారంగా పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా, మచిలీపట్నం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారించారు.
ఈ విచారణలో అతను తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తాము ఆమెను కిడ్నాప్ చేశామని, ఓ గదిలో బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పాడని తెలుస్తోంది. పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications