నెల్లూరు పాలిటెక్నిక్ విద్యార్ధిని రేప్ కేసు: కామపిశాచిని కాపాడుతున్న సచివాలయ అధికారి

అమరావతి: 'నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా' అంటూ నెల్లూరులో పాలిటెక్నిక్ చదువుతున్న ఓ బాలికను బలవంతంగా లొంగదీసుకుని గర్భవతిని చేసిన కామపిశాచి ఉడతా సురేశ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి తాజాగా ఓ కొత్తకోణం వెలుగు చూసింది.

ఈ కేసు నుంచి నిందితుడిని కాపాడేందుకు కొన్ని శక్తలు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. నిందితుడి బంధువు ఒకరు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్నారట. ఆ ఆధికారి ఈ కామాంధుడిని కాపాడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా సమాచారం.

అయితే నిందితుడు గతంలో కూడా మహిళలపై పలు అత్యాచారాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితుడు జిల్లాలోని మూలాపేట నీలగిరిసంఘానికి చెందిన పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతోన్న విద్యార్ధినిని నగ్నంగా చిత్రీకరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

నెల రోజులు క్రితం విద్యార్థిని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. న్యాయం జరగకపోవడంతో విద్యార్థిని అత్మాహత్యయత్నానికి పాల్పడింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడని, బ్లూ ఫిల్మ్‌లు తీస్తూ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడని, అమ్మాయిలు బయటకు వెళ్తే నీడలా వెంటాడతాడని స్థానికులు వాపోతున్నారు.

నిందితుడిని ఉరి తీయడమే సరైన శిక్షని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉడతా సురేశ్‌ నెల్లూరులో జిరాక్స్‌ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహమైన ఇతడికి ఇద్దరు పిల్లలున్నారు. గతంలో కూడా బాధితురాలిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు.

Girl raped by blackmailing with nude video in Nellore, attempts suicide

బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు. కొంతకాలం బాగానే గడిచింది. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కాలేజీకి వెళుతున్న సమయంలో వెంటపడేవాడు.

ఒకరోజు సురేశ్‌.. ఫోన్‌లో బాలికను తీవ్రంగా బెదిరించాడు. ''నీకు సంబంధించిన నీలి చిత్రాలు కొన్ని నా దగ్గరున్నాయి. మా షాపు దగ్గరకొస్తే ఇస్తాను'' అని చెప్పడంతో బాధితురాలు అక్కడికెళ్లింది. ఆ నీలిచిత్రాలు ఇవ్వవని బతిమాలింది. ఆమె నిస్సహాయతని సురేశ్‌ అవకాశంగా తీసుకొని.. బలవంతంగా లొంగదీసుకొన్నాడు.

తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయినా వదలకుండా ఆమెపై సురేశ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

దాంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు. ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీన టెక్కేమిట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+