అమ్మాయిపై ఆటో డ్రైవర్ సహా నలుగురు గ్యాంగ్ రేప్
విశాఖపట్నం: ఇంటికి ఆటోలో వెళ్తున్న ఓ బాలికపై ఆటోడ్రైవర్ సహా నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. విశాఖకు సమీపంలోని పిఎమ్ పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని సాగర్‌నగర్‌లో ఉంటున్న ఓ బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఓ కిరాణా దుకాణంలో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి దుకాణం నుండి ఇంటికి వెళ్లడానికి అప్పుఘర్ వద్ద ఆటో ఎక్కింది. ఆటో కొద్ది దూరం వరకు వెళ్లిన తర్వాత ఆటోడ్రైవర్ స్నేహితులు ముగ్గురు ఆటో ఎక్కారు. విశాఖ వాలీ స్కూలు సమీపంలోని తుప్పల వద్ద ఆటోను ఆపి బాలికపై ఆటోడ్రైవర్ సహా అతని స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక ఇంటికి చేరడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆదివారం ఉదయం స్థానిక పోలీసులకు బాలికతో పాటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్‌కు తరలించి అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ కిరణ్‌ను పోలీసులు గుర్తించి అతనిని, అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. పిఎమ్‌పాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చలికి తాళలేక ఇద్దరు మృతి
చలి గాలుల తీవ్రతకు విశాఖ జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. ఏజెన్సీ ప్రాంతంలోని పాడేరు మండలం తుంపాడ గ్రామానికి చెందిన రీమలి పిన్నాలు (70) అనే వృద్ధుడితో పాటు దేవరాపల్లి మండలంలోని ఎం.అలమండ గ్రామానికి చెందిన గుమ్మడి సన్నిబాబు (55) చలికి తట్టుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో చలి కారణంగా పాడేరు ప్రాంతంలో మృతిచెందిన వారి సంఖ్య 7కు చేరింది. రాజస్థాన్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఇటీవల పాడేరులో చలికి మృతి చెందగా, వివిధ ప్రాంతాలలో మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications