తోటలోకి లాక్కెళ్లి, దుస్తులు చించేసి అత్యాచారం
విశాఖపట్నం: చిల్లర దొంగతనాలు చేసే ఓ జులాయి బాలికపై తెగబడ్డాడు. నోరు నొక్కి చెరుకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆమె దుస్తులు చించేశాడు. ఆ తర్వాత ఆమె మీదకు దూకి బలాత్కారం చేశాడు. అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. విశాఖ పట్నం జిల్లా రావికమతం మండలం మత్స్యవాని పాలెం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
బూరుగుపాలెం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మత్స్యవానిపాలెంలో ఉన్న ఆమె బావ ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఆదాడ రాజశేఖర్(22) చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ జులాయిగా తిరుగుతుండేవాడు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బాలిక బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడే పొంచి ఉన్న రాజశేఖర్ ఆ బాలిక నోరు నొక్కి చెరకు తోటలోకి లాక్కెళ్లాడు.

ఆ బాలిక శరీరంపై దుస్తులు చించేశాడు. ఆపై అఘాయిత్యానికి పాల్పడి పారిపోయాడు. ఆ బాలిక కేకలు విన్న కొందరు అక్కడికి వెళ్లి చూసి ఆమె బావ మహేష్‌కు సమాచారం ఇవ్వడంతో అతను పరుగున వెళ్లి బాలికను ఇంటికి తీసుకువచ్చాడు. గ్రామ పెద్దలు పంచాయతీ చేసి సద్దుమణిగించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బాధితురాలి బంధువులు రాత్రి 9 గంటల ప్రాంతంలో కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. బాలికను, ఆమె బంధువులను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications