కుక్క పిల్లలను చూపిస్తానని ఆశపెట్టి బాలికపై అత్యాచారం

విజయవాడ: కామాంధులు ఎంతకైనా తెగిస్తున్నారని చెప్పడానికి కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటనే ఉదాహరణ. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని కీర్తిరాయనిగూడెంలో సోమవారం ఓ బాలికపై అత్యాచార సంఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన ఒక మహిళ తన కుమార్తె(8)ను తీసుకుని తన పుట్టింటికి కీర్తిరాయినిగూడెం చర్చిలో ప్రార్థనకు ఈ నెల 5న వచ్చింది. ఆ బాలిక సోమవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సమయంలో సమీపంలో ఉంటున్న మల్లాది సురేంద్రబాబు (17) బాలికను పిలిచి తమ ఇంటి వద్ద కుక్కపిల్లలున్నాయని చూపుతానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్ళి ఆ బాలికపై అత్యాచారం చేశాడు.

girl raped luring with puppies in Krishna district

ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుండగా తన కుమార్తెను వెతుకుతూ తల్లి ఎదురు వెళ్ళింది. కుమార్తెను చూసి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పి విలపించింది.

వెంటనే ఇరుగు పొరుగు నరేంద్రబాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అల్లు దుర్గాప్రసాద్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+