Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడ్వాంటేజ్ ఏపీ - అందరి చూపు విశాఖ వైపే: సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్..!!

విశాఖ నగరంలో భారీ పెట్టుబడు దారుల సదస్సుకు సర్వం సిద్దమైంది. అందరి చూపు విశాఖ వైపే.

ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే. అంతర్జాతీయ ప్రముఖులు..కేంద్ర మంత్రులు.. పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 కోసం సర్వం సిద్దమైంది. 26 దేశాల నుంచి సుమారు 8 వేల మంది హాజరుకానున్న ఈ భారీ పెట్టుబడుల సదస్సు ద్వారా ఏపీకి రెండు లక్షల కోట్ల రూపాయాల పెట్టబడులు తేవటం ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. నేడు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోపన్యాసం కీలక కానుంది. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటుగా ప్రభుత్వ విధానాలను సీఎం వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తోంది.

రూ 2 లక్షల కోట్ల పెట్టబడులే లక్ష్యంగా

రూ 2 లక్షల కోట్ల పెట్టబడులే లక్ష్యంగా

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విశాఖ చేరుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. రూ రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడి ఒప్పందాలే లక్ష్యంగా ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. తక్కువ సమయంలోనే ఈ పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావటంతో పాటుగా భారీగా ఉపాధి కల్పన కల్పించేలా ఒప్పందాలు ఉంటాయని మంత్రులు చెబుతున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటున్నారు. రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా తో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు.

తొలి రోజు షెడ్యూల్ ఇలా..

తొలి రోజు షెడ్యూల్ ఇలా..

పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవం..తొలి రోజు కార్యక్రమాలను ఖరారు చేసారు. ఉదయం 9.45 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు లేజర్ షో ఏర్పాటు చేసారు. మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సదస్సుకు హాజరైన వారికి ఆహ్వానం పలుకుతూ సదస్సు ప్రారంభించాల్సిందిగా మంత్రులను కోరుతారు. మంత్రులుగ గుడివాడ అమర్నాధ్..బుగ్గన రాజేంద్రనాద్ ఇద్దరూ సదస్సు ఉద్దేశాలను వివరించనున్నారు. 21 మంది పారిశ్రామిక వేత్తలు సదస్సుకు సంబంధించి మాట్లాడున్నారు. ఆ తరువాత ముఖేష్ అంబానీ సదస్సులో ప్రసంగిస్తారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీ నోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. మధ్నాహ్నం 1.35 గంటలకు సీఎం జగన్ సదస్సును ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. దాదాపు 20 నిమిషాలు సీఎం జగన్ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరిస్తూ..ప్రభుత్వ విధానాలను స్పష్టం చేయనున్నారు.

అతిధులకు ఆతిథ్యం..ప్రత్యేక ఏర్పాట్లు

అతిధులకు ఆతిథ్యం..ప్రత్యేక ఏర్పాట్లు

సదస్సుకు వచ్చే పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంకు పారిశ్రామిక వేత్తలు చేరుకున్న సమయం నుంచి వారికి సదస్సులో పాల్గొని..తిరిగి వెళ్లే వరకు ప్రత్యేకంగా వారి బాధ్యతలను అధికారుల టీంకు అప్పగించింది. కొంత మంత్రి పారిశ్రామిక ప్రముఖులు ప్రత్యేక విమానాల్లో విశాఖకు చేరుకుంటున్నారు. వారికి బస చేయటం కోసం 17 ప్రముఖ హోటళ్లలోని 550 గదులు సిద్దం చేసారు. ఇప్పటికే కొందరు విశాఖ చేరుకున్నరు. 26 దేశాల నుంచి అతిధులు రాక ఖరారైంది. పలు కీలక రంగాలకు సంబంధించిన సెషన్స్.. ఒప్పందాలు జరగనున్నాయి. రెండో రోజు సదస్సులో పెట్టుబడుల పై ఒప్పందాలు జరగనున్నాయి. ఈ రోజు రాత్రి అతిధులకు ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వం తరపున విందు ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ముఖ్యమంత్రి జగన్ కు ఈ సదస్సు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఏపీకి వచ్చే పెట్టుబడులు..జరిగే ఒప్పందాల పైనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+