జగనన్న మీకు చిరంజీవికి కన్నా అభిమానులు ఎక్కువే: కరోనాపై సందేశం ఇవ్వండి:రఘురామ
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో సూచన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలకు సందేశం ఇవ్వాలని కోరారు. మీరు సందేశం ఇస్తే అధికారుల్లోనే కాదు ప్రజల్లో కూడా సీరియస్ నెస్ వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన.. కరోనా వైరస్ నిర్మూలన కోసం మరో ప్రోగ్రాం చేపట్టాలని కోరారు.

జగనన్న కరోనా కేర్, కరోనా వార్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రఘురామ గుర్తుచేశారు. దాదాపు 20 కార్యక్రమాలు జగనన్న పేరుతో ఉన్నాయని.. వైరస్‌పై పోరాడే మరో కార్యక్రమం చేయాలని సూచించారు. దీనిపై యుద్ధప్రాతికదన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆ కార్యక్రమానికి జగనన్న కరోనా కేర్, జగనన్న కరోనా వార్ పేరు పెడితే బాగుంటుందన్నారు.

చిరంజీవి కన్నా ఎక్కువే..?
కరోనా వైరస్ గురించి మెగాస్టార్ చిరంజీవి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని రఘురామ గుర్తుచేశారు. ఆయన స్టార్ అయినందున ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారని చెప్పారు. అయితే జగనన్నకు చిరంజీవి కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారని తెలిపారు. కరోనా వైరస్‌పై ఓ మంచి కార్యక్రమం చేపడితే మంచి స్పందన వస్తుందని తెలిపారు. చక్కని వీడియో తీసి.. ప్రజలకు సందేశం ఇవ్వాలని కోరారు.
Recommended Video

విమర్శలు-సలహాలు
రఘురామ కృష్ణంరాజు స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్, ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై విమర్శలు చేయడంతో అధి నాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేయాలని స్పీకర్‌ను వైసీపీ ఎంపీల ప్రతినిధి బృందం స్పీకర్ ఓం బిర్లాను కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గంలో కాక.. ఢిల్లీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. జగన్‌ను కరోనాపై సందేశం ఇవ్వాలని కోరిన రఘురామ.. అంతకుముందు తన నియోజకవర్గంలో మున్సిపాలిటీ చెత్త వేసే బండిలో కరోనా బాధితుడిని తీసుకెళ్లడంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని హాట్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications