బెజవాడ దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై గాజు సీసాతో దాడి
విజయవాడ: బెజవాడ దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. కాటి కాపరి గుంజా కృష్ణ అనే వ్యక్తి రాంబాబుపై గాజు సీసాతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో కర్నాటికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను బంధువులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇటీవలే రాంబాబు తండ్రి మరణించడంతో.. ఆయన శ్మశానంలో దీపం పెట్టేందుకు వెళ్లారు. శ్మశానంలో దీపం పెట్టి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో.. కాటి కాపరి గాజు సీసాతో వెనక నుంచి దాడి చేశాడు. దాడిని గమనించిన రాంబాబు తప్పుకునేందుకు ప్రయత్నించగా సీసా పొట్టలో దిగింది. దీంతో రక్తస్రావమైంది. గమనించిన బంధువులు వెంటనే కర్నాటిని ఆసుపత్రికి తరలించారు.

కర్నాటి రాంబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడ కమిషనర్ రాంబాబును ఫోన్ ద్వారా సంప్రదించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, కర్నాటి రాంబాబుపై దాడికి సంబంధించిన వివరాలను ఏసీపీ రవికాంత్ మీడియాకు వెల్లడించారు. రాంబాబుపై దాడి చేసిన గుంజా కృష్ణ ఓ కాటికాపరి అని తెలిపారు. రాంబాబు తన తండ్రి సమాధిని శుభ్రం చేసేందుకు కొంత డబ్బు ఇచ్చారు. రాంబాబు తనకు తక్కువ డబ్బులు ఇచ్చారనే కోపంతో గుంజా కృష్ణ ఆయనపై దాడి చేశారు. గాయపడిన రాంబాబు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. దాడి చేసిన గుంజా కృష్ణను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ రవికాంత్ తెలిపారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications