హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ క్రికెటరా!: వరిగడ్డి వరల్డ్‌కప్, జేమ్స్ హ్యాపీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వ్యవసాయ రంగానికి గత వైభవం తీసుకొచ్చేందుకు శాస్తవ్రేత్తలు, నిపుణులు కృషి చేయకపోతే సంక్షోభంలో పడే ప్రమాదముందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేదని, రైతులు తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఇదే వృత్తిని ఎంచుకొని గ్రామాల్లోనే నివసించే వారని ఆయన అన్నారు.

క్రమంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడికి తగినట్టుగా సాగు గిట్టుబాటుకాక రైతులు ఇతర రంగాలను ఆశ్రయించడంతో వ్యవసాయం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను విశే్లషించి, రైతులకు సరైన మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత శాస్తవ్రేత్తలు, నిపుణులపై ఉందని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి)లో మూడు రోజులపాటు జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ కాంగ్రెస్ మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్ సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిధిగా కిరణ్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా యువత, విద్యావంతుల దృష్టిని ఇటు మళ్లీంచే దిశగా శాస్తవ్రేత్తలు, నిపుణులు అధ్యయనం చేయాలన్నారు.

కాగా, ప్రపంచ వ్యవసాయ సదస్సు ప్రారంభ సమయానికి పలు ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు. వారిని సదస్సు వద్దకు పోలీసులు అనుమతించలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 50 మంది అభ్యుదయ రైతులను మాత్రమే సదస్సుకు అనుమతించారు.

సదస్సు 1

సదస్సు 1

రైతుకు నికరాదాయం అన్నదే లేకుండాపోయిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పౌల్ట్రీ, డెయిరీ, చేపలు, గొర్రెల పెంపకం వంటివాటితో రైతుకు ఏటా కచ్చితంగా ఎంతోకొంత ఆదాయం వచ్చేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు.

సదస్సు 2

సదస్సు 2

గతంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేది. రైతులు తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఇదే వృత్తిని ఎంచుకొని గ్రామాల్లోనే నివసించేవారు' అని ముఖ్యమంత్రి అన్నారు.

సదస్సు 3

సదస్సు 3

క్రమంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడికి తగినట్టుగా సాగు గిట్టుబాటుకాక రైతులు ఇతర రంగాలను ఆశ్రయించడంతో వ్యవసాయం కుదేలైందని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సదస్సు 4

సదస్సు 4

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రపంచ వ్యవసాయ సదస్సు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా యువత, విద్యావంతుల దృష్టిని ఇటు మళ్లీంచే దిశగా శాస్తవ్రేత్తలు, నిపుణులు అధ్యయనం చేయాలన్నారు.

సదస్సు 5

సదస్సు 5

ఈ సదస్సుతో సాగుకు పూర్వ వైభవం రావాలని కిరణ్ ఆకాంక్షించారు. భూకమతాల విస్తీర్ణం తగ్గిపోవడం కూడా సాగుకు పెద్ద సవాల్ ఎదురైందన్నారు.

సదస్సు 6

సదస్సు 6

వ్యవసాయ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్న ప్రపంచ వ్యవసాయ ఫోరం సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్.

సదస్సు 7

సదస్సు 7

వ్యవసాయ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్న ప్రపంచ వ్యవసాయ ఫోరం సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్. చిరునవ్వులు చిందిస్తూ కిరణ్, జేమ్స్

సదస్సు 8

సదస్సు 8

హైదరాబాదులోని ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రదర్శనను తిలకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి టిజి వెంకటేష్, ఇతరుల దృశ్యం.

సదస్సు 9

సదస్సు 9

హైదరాబాదులోని ప్రపంచ వ్యవసాయ సదస్సు ప్రదర్శనో ఆధునిక యంత్రాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇతరులు.

సదస్సు 10

సదస్సు 10

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రపంచ వ్యవసాయ ఫోరం సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్, మంత్రులు టిజి వెంకటేష్ ఇతరుల ఫోటో షూట్.

సదస్సు 11

సదస్సు 11

సదస్సులోకి తమను అనుమతించలేదని పలువురు రైతులు నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన 50 మంది అభ్యుదయ రైతులను మాత్రమే సదస్సుకు అనుమతించారు.

సదస్సు 12

సదస్సు 12

వ్యవసాయ ప్రదర్శనలో కిరణ్ కుమార్ రెడ్డికి వరి గడ్డితో చేసిన క్రికెట్ ప్రపంచ కప్ నమూనాను ఓ ప్రదర్శన ప్రతినిధి బహూకరించారు. ఈ సమయంలో కిరణ్ క్రికెటర్ అని తెలియడంతో జేమ్స్ బోల్గర్ సంతోషం వ్యక్తం చేశారు.

English summary
The four day world Agricultural Forum conference has bebun in Hyderbad amid protests from farmers and non government organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X