పుష్కరాలు: గోదావరి నదిలో 'బాహుబలి' శివగామి! బాబు హ్యాపీ

రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లకు లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మూడో రోజైన గురువారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది.

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బాహుబలిని శివగామి ఒంటి చెత్తో శిశువును పట్టుకొని వాగులో ఉంటుంది. అలాంటి చిత్రమే కనిపించింది. కొవ్వూరులో ఓ తల్లి ఇద్దరు బిడ్డలను, రాజమండ్రిలో ఓ బిడ్డను గోదావరిలో ఒంటి చెత్తో పైకి ఎత్తిన దృశ్యం కనిపించింది.

ఇదిలా ఉండగా, మూడో రోజైన గురువారం నాడూ పుష్కర ఘాట్‌లు కిటకిటలాడాయి. వేల సంఖ్యలో పిండ ప్రదానం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారని తెలుస్తోంది. చంద్రబాబు కొవ్వూరులో పర్యటించారు.

బాహుబలి శివగామి

బాహుబలి శివగామి

బాహుబలి సినిమాలో శివగామి ఒంటి చెత్తో శిశువును పట్టుకొని వాగులో ఉంటుంది. అలాంటి చిత్రమే రాజమండ్రిలో కనిపించింది.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాలకు వచ్చే ప్రతీ యాత్రికుడు సంతృప్తిగా తిరిగి వెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గురువారం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పర్యటించిన ఆయన పుష్కర ఏర్పాట్లు, పుష్కరాలు జరుగుతున్న తీరు తెన్నులు పరిశీలించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులు తృప్తిగా స్నానాలు చేసి వెళుతున్నారని చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాలు జరుగుతున్న తీరు, అధికారులు చేసిన ఏర్పాట్లపై తాను సంతృప్తి చెందుతున్నానని చంద్రబాబు వెల్లడించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

సుమారు 2,800 మంది యాత్రికులు ద్వారకా తిరుమల నుంచి పుష్కర శోభాయాత్ర పేరుతో రాజమండ్రి వెళుతున్నారని వారికి స్వాగతం పలికానన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

దేశ, విదేశాల నుంచి అధికంగా వస్తున్నారని బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఒక కుటుంబం పుష్కర స్నానాలు చేసి గోదావరిపై అనుబంధాన్ని చాటుకున్నారన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరాల సమయంలో మనమంతా పాలుపంచుకునే అవకాశం రావడం అందరి అదృష్టమని ప్రతీఒక్కరు పుష్కర స్నానం చేసి పునీతులవ్వాలని చంద్రబాబు కోరారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాల సంద్రభంగా చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆయన రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అందరినీ పలుకరిస్తూముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం మీదుగా కొవ్వూరు గోష్పద క్షేత్రం వద్దకు వచ్చారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోష్పాద ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లిన సీఎం చంద్రబాబు పుష్కర యాత్రికులకు ఏవిధమైన ఇబ్బంది కలగకుండా వారిలో కలిసిపోయి తాను ఒక్కడినై పుష్కర స్నానాలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కొవ్వూరులో ఎక్కడా కూడా సీఎం వస్తున్నారనే హడావుడి లేకుండా చాలా సాదాసీదాగా ఆయన పర్యటన ముగిసింది.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

చంద్రబాబు కనిపించిన భక్తులను పుష్కర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. చాలామంది బాగున్నాయని చెప్పారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని అందరు చెప్పడం గమనార్హం.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవ రావుకు సూచించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మాట్లాడుతూ.. పుష్కరాల్లో తొలి రోజు జరిగిన ప్రమాదానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పుష్కర ఘాట్ ప్రమాద బాధితులను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+