వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 4న జివోఎం రిపోర్ట్, శీతాకాల సమావేశాల్లోనే టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిసెంబర్ 4వ తేదిన కేబినెట్‌కు మంత్రుల బృందం (జివోఎం) విభజన అంశంపై నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజు తెలంగాణ బిల్లు ఖరారు కానుంది. గురువారం జివోఎం సభ్యులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్‌లు భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్‌లోని చిదంబరం కార్యాలయంలో జివోఎం సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడతామని చెప్పారు. బిల్లులో ఎలాంటి లోపాలు లేకుండా నిపుణులతో చర్చిస్తున్నామని, చిన్న లోపాల పైన కూడా తాము దృష్టి సారిస్తున్నామని హోంమంత్రి తెలిపారు.

GoM

కాగా, అనేక మార్పులు, చేర్పుల అనంతరం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ విభజన పైన జివోఎం తుది నివేదికను ఖరారు చేసింది. ఇదే నివేదికను రేపు కోర్ కమిటీకి జివోఎం నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత మరోసారి జివోఎం సభ్యులు భేటీ కానున్నారు. అదే రోజు పూర్తిస్థాయి డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన చేస్తారు. 4న కేబినెట్‌కు ఇస్తారు.

మా చుట్టూ తిరగొద్దు!

హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు తథ్యమని జివోఎం సీమాంధ్ర నేతలకు తెలిపింది! హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని డిమాండ్స్ వినిపించవద్దని వారికి జివోఎం సభ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది.

English summary
The Group of Ministers (GoM) may give report on AP division issue to Central Cabinet on December 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X