రాజధాని, శతాబ్దితో సహా ఆ రైళ్ళలో ఇకపై ఆటోమేటిక్ గా.. వారికి రైల్వే శుభవార్త!
ఇండియన్ రైల్వే మహిళా ప్రయాణికులకు, వృద్ధులకు భారీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రైల్వే తాజాగా మరొక శుభవార్తను ప్రకటించింది. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణం చేసే మహిళలు వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేలా బెర్తుల కేటాయింపులకు కీలక మార్పులను రైల్వే ప్రకటించింది.
రైళ్ళలో బెర్త్ ల విషయంలో మహిళలు, వృద్ధులకు ఇబ్బంది
ఇకపై 45 సంవత్సరాలు పైబడిన మహిళలు, వృద్ధులు రైలు టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ ని ఎంపిక చేసుకోక పోయినప్పటికీ, వారికి టికెట్ బుకింగ్ ఆటోమేటిగ్గా లోయర్ బెర్తులకే కేటాయించబడుతుందని పేర్కొంది. రైళ్ళలో మహిళలు అప్పర్ బెర్త్ ల పైకి ఎక్కలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు, వృద్ధులకు చాలా సంతోషం కలిగిస్తుంది.

ఆటోమేటిక్ గా వారికి లోయర్ బెర్త్ లు
సాధారణంగా రైళ్లలో మహిళలు, వృద్ధులకు లోయర్ బెర్త్ లను కేటాయిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అప్పర్ బెర్త్ లను కూడా కేటాయించటం వలన వారు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ప్రయాణికులు బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ కావాలంటే ఎంచుకోవలసి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ సమయంలో ఎంపిక చేసుకోక పోయినప్పటికీ కూడా 45సంవత్సరాలు పైబడిన మహిళలకు, వృద్ధులకు భారతీయ రైల్వే ఆటోమేటిక్ గా లోయర్ వ్యక్తులను కేటాయించనుంది.
రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
ఈ మేరకు బుకింగ్ విధానంలో కీలక మార్పులను రైల్వే చేపట్టింది. అంతేకాదు దివ్యాంగులకు వారి సహాయకులకు కొన్ని బెర్త్ లను ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తున్నట్టు పేర్కొంది. ఇదే విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్లీపర్ కోచ్ లలో దివ్యాంగులు, మహిళలు, పెద్దలకు ఆరు నుండి ఏడు లోయర్ బెర్త్ లు, 3ఏసీలో 4నుండి 5, సెకండ్ ఏసీలో మూడు నుండి నాలుగు బెర్త్ లు కేటాయించనున్నారు.
అన్ని రైళ్ళలోనూ ఇకపై ఈ సదుపాయం
ఈ సౌకర్యం గర్భిణీ స్త్రీలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ మార్పులను చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్ల తో పాటు అన్ని రైళ్ల లోను ఈ మేరకు లోయర్ బెర్త్ ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications