amaravati : అమరావతి రైతులకు శుభవార్త

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల సమయం తీసుకొని మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించడంతో అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని పరిధిలో నిర్మాణంజరుపుకుంటున్న ప్రాంతాలన్నీ పిచ్చిచెట్లతో నిండిపోయాయి. ఈ ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. వచ్చేనెల 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తాను నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో అమరావతి గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తోంది. తాజాగా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఎన్నికల ప్రచారంలో మంగళగిరిని గోల్డ్ హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, భూగర్భ వ్యవస్థ తో ప్రతి ఇంటికీ కృష్ణా జలాలను అందిస్తామని చెప్పారు.

good news for ap capital amaravati farmers

ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే భారీగా గంజాయి లభిస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వాస్తవాలను సోషల్ మీడియాలో పెడుతుంటే జైలుకు పంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి లోకేష్ దృష్టికి తీసుకురాగా సమాజమంతా ఐదు సంవత్సరాల నుంచి భయం భయంగా బతుకుతోందని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో దేశ విదేశాల్లోని తెలుగువారంతా అండగా నిలబడ్డారన్నారు. జీవితాంతం ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈనెల 18వ తేదీన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోకేష్ నామినేషన్ వేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+