ఏపీకి రైల్వే శుభవార్త
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రాష్ట్రంలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపనున్నారు. ఈమేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ప్రయాణికులు ఎక్కడెక్కడ, ఏ స్టేషన్లలో, ఏ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తున్నారో వాటి నుంచి పరిగణనలోకి తీసుకున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, కుప్పం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ, తెలంగాణలోని డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు.
బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో
యశ్వంత్‌పూర్- హతియా ఎక్స్‌ప్రెస్ (12835), యశ్వంత్‌పూర్- టాటా నగర్(12889), హతియా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (22837 - 22838) ఆగుతుంది.

దువ్వాడలో
శంకర్‌పల్లి- ముంబై ఎక్స్‌ప్రెస్ (18519 , 18520), విశాఖపట్నం- హజ్రత్ నిజాముద్దీన్ (12803, 12804) రైళ్లకు హాల్ట్ ఇచ్చారు.
పిడుగురాళ్లలో
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), భువనేశ్వర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ విశాఖ (17015).. నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్(17232), సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12733)
సత్తెనపల్లిలో
భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603) రైళ్లు ఆగుతాయి.
నడికుడిలో
సికింద్రాబాద్- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12733), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232)
సూళ్లూరుపేటలో
అలప్పుజా-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352)
పీలేరులో
నాగర్‌కోయిల్ - ముంబై ఎక్స్‌ప్రెస్ (16340, 16339) , కాచిగూడ-మధురై ఎక్స్‌ప్రెస్ (17615, 17616)
కుప్పంలో
చెన్నై-శిరిడీ ఎక్స్‌ప్రెస్ (22601, 22602)
డోర్నకల్‌లో
లింగంపల్లి - కాకినాడ ఎక్స్‌ప్రెస్ (12737), 12738), మచిలీపట్నం- బీదర్ ఎక్స్‌ప్రెస్ (12749, 12750) రైళ్లకు స్టాప్‌లు కొత్తగా ఇచ్చారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications