Train: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్
విజయ దశమి, దీపావళి పర్వదినాల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఊరట లభించింది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తిరుగుతున్నాయి? ఏయే తేదీల్లో అందుబాటులో ఉన్నాయి? అనే వివరాలను తెలుసుకుందాం.
అక్టోబర్ 31న విశాఖపట్నం నుంచి కర్నూల్ సిటీ రైలు అందుబాటులో ఉండనుంది. నవంబర్ 7, నవంబర్ 14 తేదీల్లో కూడా తిప్పుతున్నారు. అలాగే కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం వరకు రైలును నవంబరు 1, 8, 15 తేదీల్లో తిరగబోతోంది.

అక్టోబర్ 28, నవంబర్ 4, నవంబర్ 6 తేదీల్లో చెన్నై నుంచి సంత్రాగచ్చి రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
అక్టోబర్ 30, 31, నవంబర్ 6,7 తేదీల్లోచెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్లే రైలు ఏర్పాటైంది.
అక్టోబర్ 26, 27 తేదీల్లో నాందేడ్ పానిపట్టు రైలు అందుబాటులో ఉంటుంది.
ఈ రైళ్లల్లో ఫస్ట్ ఏసీ , సెకండ్ ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 58 ప్రత్యేక రైళ్లు పరుగులు తీయనున్నాయి. పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీపావళి, ఛత్ సమయంలో ఆ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. యూపీ, బీహార్ వైపు తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఒడిసాలోని బాలసోర్ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు రైల్వే నడుం బిగించింది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రైళ్లను రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించి తిప్పడం చేస్తున్నారు. రైల్వేకు సహకరించాలని అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications