రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. ఎప్పటిలానే ఎండీయూ వాహనాలద్వారా సరకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం ఏడుగంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. గోధుమపిండి, పంచదార, ఐరన్, విటమిన్ బీ 12 పోషక విలువలతో కూడిన బియ్యం ఇంటివద్దకే రానున్నాయి. రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
గోధుమ పిండి కేజీ రూ. 16గా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానంలో వీఆర్వోలు రేషన్ పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం, కొనడం రెండూ నేరమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక జారీచేస్తున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయాలని సూచించారు.

రేషన్ కార్డులు ఉన్నవారు ఆరునెలలపాటు వరుసగా ఆహార ధాన్యాలు తీసుకోకపోతే వారి కార్డును రద్దు చేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హులైనవారికి సరకులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎంతోమంది అనర్హులు లబ్ధిపొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటువంటివారిని గుర్తించి అనర్హులకు కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేద ప్రజలకు ఆహార పదార్థాలను ప్రభుత్వం కరోనా సమయం నుంచి నేరుగా పంపిణీ చేస్తోంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం అనర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రజాపంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో ముందుకు రాబోతోంది.












Click it and Unblock the Notifications