ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఆంధ్రా యాత్రి తక్కువ ధరకే ట్యాక్సీ సేవలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా రంగంలో మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా Ola, Uber వంటి ప్రైవేట్ యాప్‌లు ఆటో, క్యాబ్ సేవలు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రా యాత్రి' పేరుతో ఒక యాత్రా యాప్ ను తీసుకొస్తోంది. ఏపీకి వచ్చే యాత్రికుల కోసం సొంత రైడ్ బుకింగ్ యాప్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రజలకు తక్కువ ఖర్చుతో, డ్రైవర్లకు ఎక్కువ ఆదాయంతో కూడిన పారదర్శక సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు.

ఆంధ్రా యాత్రి యాప్ తో లాభం

ప్రస్తుతం ప్రైవేట్ యాప్‌లు వాహన సేవలను అందిస్తున్నాయి. ప్రతి రైడ్‌పై 20 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. అయితే 'ఆంధ్రా యాత్రి'లో నామమాత్రపు రుసుమే వసూలు చేయనున్నారు. ఒక్కో ట్రిప్‌కు కారుకు రూ.11, ఆటోకు రూ.5, బైక్ కు రూ.3 అలాగే రోజుకు రూ. 30 నుంచి రూ. 50 చెల్లిస్తే వాళ్ళు అపరిమిత రైడ్‌లు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ యాప్ ద్వారా యాత్రికులు తక్కువ ఖర్చుతో తాము చూడాలనుకునే ప్రదేశాలకు వెళ్ళవచ్చు.

Good news from the AP govt Taxi services at low prices for Andhra pilgrims here is the details

ఈ యాప్ వివిధ శాఖలతో అనుసంధానం

ఈ ఆంధ్రా యాత్రి యాప్ ను రవాణా శాఖతో పాటు, టూరిజం, పోలీస్, ఆర్టీజీఎస్, కార్మిక శాఖలతో అనుసంధానించనున్నారు.ఈ అనుసంధానం ద్వారా ప్రయాణికులకు రియల్-టైమ్ ట్రాకింగ్, భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ యాప్ ను మొదట విజయవాడ, తిరుపతి లలో ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆపైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు.ప్రస్తుతం యాప్ అభివృద్ధి దశలో ఉంది. అవసరమైన నిబంధనలు ఖరారు చేసిన తర్వాత టెండర్లు పిలుస్తారు.

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో యాప్ నిర్వహణ

ఈ యాప్‌ను పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో నిర్వహించనున్నారు. సేకరించిన రుసుములో 10 శాతం యాప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన నిధులను రవాణా శాఖ బ్రాండింగ్, ప్రచారం వంటి అవసరాలకు వినియోగిస్తుంది. త్వరలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి, తక్కువ ధరలకు యాప్ నిర్వహించగల సంస్థకు టెండర్ ఖరారు చేయనున్నారు.

భవిష్యత్‌లో భారత్ యాత్రి యాప్ లో విలీనం అవకాశం

కేంద్ర ప్రభుత్వం 'భారత్ యాత్రి' పేరిట కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి యాప్‌లను ప్రారంభించిన నేపథ్యంలో, భవిష్యత్తులో 'ఆంధ్రా యాత్రి'ని దానిలో విలీనం చేసే అవకాశమూ ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ల కోసం 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు 'ఆంధ్రా యాత్రి' ద్వారా రవాణా సేవలను మరింత విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర రవాణా రంగంలో గేమ్ ఛేంజర్‌గా ఈ యాప్ ను మార్చనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+