హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు చెక్.. స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్
హైదరాబాద్ అనగానే అందరికీ ముందు గుర్తొస్తుంది ట్రాఫిక్ సమస్య. అంతేకాదు ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలి అన్నది హైదరాబాద్లో అతిపెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అటువంటి హైదరాబాద్లో వాహనదారులకు జిహెచ్ఎంసి శుభవార్త చెప్పింది. బహిరంగ ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో ఓ కొత్త విధానానికి జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది.
స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్
స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్ ప్రాజెక్టును జిహెచ్ఎంసి అమలు చేయనుంది. ఈ నూతన విధానం మై జిహెచ్ఎంసి మొబైల్ యాప్ తో అనుసంధానమై ఉంటుంది. యాప్ లోని ప్రత్యేక లింకు ద్వారా వాహనదారులు స్ట్రీట్ పార్కింగ్ స్లాట్ లైన్ గుర్తించి బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక పార్కింగ్ స్థలాల వద్ద కూడా సెన్సార్లను అమర్చి, ఖాళీ స్లాట్ ల సమాచారాన్ని యాప్ లో నిరంతరం అప్డేట్ చేస్తారు.

రుసుము చెప్పించి యాప్ లోనే బుక్ చేసుకునేలా పార్కింగ్
చుట్టూ 500 మీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న స్లాట్ లను నిర్ణీత రుసుము చెల్లించి బుక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. వాకింగ్ సమస్యకు పరిష్కారంగా ఈ ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు పేర్కొంటున్నారు. గత సంవత్సరం ఖైరతాబాద్ జోన్ పరిధిలో అక్టోబర్లో ఈ ప్రాజెక్టుకు టెండర్లను పిలిచారు. టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కాగా రెండు సంస్థలు ఈ కాంట్రాక్టులను దక్కించుకున్నాయి.
14 ప్రాంతాలలో స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్
జిహెచ్ఎంసి ఆయా సంస్థలకు ఏడు చొప్పున మొత్తం 14 ప్రాంతాలను కేటాయించి పార్కింగ్ స్లాట్ లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఎంపిక చేసిన చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతారు. ప్రస్తుతం ఈ సంస్థలకు సంబంధించిన పార్కింగ్ ప్రాంతాల విషయానికి వస్తే జ్రుతి సొల్యూషన్ కు సోమాజిగూడ లో ది పార్క్ హోటల్, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, షేక్పేట పై వంతెన కింద ఏర్పాటు చేస్తుంది.
ఈ ప్రాంతాల్లో అందుబాటులో
అంతేకాదు సత్యం థియేటర్ వద్ద పార్కింగ్ స్లాట్ లను సోమాజిగూడ చౌరస్తాలో సీఎంఆర్ జ్యువెలరీ ఎదురుగా పై వంతెన కింద, బజార్ ఘాట్ లోని మల్లేపల్లి వార్డు ఆఫీస్, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం, ఎంజీబీఎస్ సమీపంలోని స్టేట్ లైబ్రరీ ముందు ఈ స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి పార్కింగ్
జూకి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలో లిబర్టీ చౌరస్తాలోని టిటిడి ఆలయం, హిమాయత్ నగర్, వన్ ప్లస్ స్టోర్, మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కింద, బషీర్ బాగ్ పై వంతెన నుండి లిబర్టీ చౌరస్తా వరకు, అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్, చర్మాస్ , బ్లూ సి రెస్టారెంట్ వంటి ప్రాంతాలలో స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్ ను ఏర్పాటు చేస్తుంది.












Click it and Unblock the Notifications