ఏపీకి కేంద్రం మరో శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. ఎంతోకాలంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసలు ఎదురు చూస్తున్న కేంద్రీయ విద్యాలయం కల నెరవేరబోతుంది. కోనసీమ జిల్లాలో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఓడలరేవుల సమీపంలో కేంద్రీయ విద్యాలయం
ఈ విషయాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ వెల్లడించారు. ముమ్మిడివరంలో ఆయన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తో కలిసి ఈ విషయాన్ని పేర్కొన్నారు. అల్లవరం మండలం ఓడలరేవుల సమీపంలో ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. దీనికోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలాన్ని సేకరించామని దీనికి 3.5 కోట్ల నిధులు విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Good news from the Center for AP kendriya Vidyalaya for Konaseema district

కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు అదనంగా రూ.3.30 కోట్లు
ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో త్వరలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఇక మరోవైపు కోనసీమ జిల్లాలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు అదనంగా రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులను జారీ చేసింది.

కేంద్రీయ విద్యాలయంతో ఈ కుటుంబాలకు లబ్ది
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు, ONGC తదితర రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన CBSE విద్య అందించేందుకు ఇది గొప్ప అవకాశం గా మారనుంది. ఇక ఈ అవకాశం కల్పించడానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఓడరేవుల లో కేంద్రీయ విద్యాలయం త్వరిత గతిన ఏర్పాటు చేసేందుకు కృషి కొనసాగిస్తానని అమలాపురం ఎంపీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+