గుడ్ న్యూస్: తత్కాల్ టికెట్ల రద్దుపై డబ్బు పూర్తిగా రీఫండ్!!
ఇండియన్ రైల్వే.. దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా వ్యవస్థలలో ముఖ్యమైనది. ప్రతీరోజు లక్షల మంది ప్రయాణికులు రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. భారతీయ రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ మరియు రద్దు లను సులభతరం చేయడం కోసం రైల్వే అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. అటువంటి ఫీచర్లలో తత్కాల్ బుకింగ్ సిస్టం ఒకటి.
ఇది అప్పటికప్పుడు అత్యవసరంగా తక్కువ సమయంలో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చెయ్యాలి అనుకునేవారికి ఉపయోగపడుతుంది. తత్కాల్ టికెట్ అంటే సాధారణంగా ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు తక్కువ నోటీసు వ్యవధిలో టికెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్, రద్దు, విధానాల గురించి చాలామంది తరచుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

తత్కాల్ టికెట్ ను రద్దు చేసుకోవచ్చా? రద్దు అయితే రిఫండ్ అవుతుందా? వంటి అనేక అనుమానాలు ఉంటాయి.సహజంగా తత్కాల్ టికెట్లను ఇతర రైల్వే టికెట్ల మాదిరిగానే రద్దు చేసుకోవచ్చు. కానీ ఇందులో ఇబ్బంది ఏమిటి అంటే తత్కాల్ టికెట్ ను రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం డబ్బు రీఫండ్ ఇవ్వబడదు. టికెట్ల కోసం రిఫండ్ విధానం లేదు. కానీ ఐఆర్సిటిసి మరియు భారతీయ రైల్వేలు కొన్ని మినహాయింపులను మాత్రం అనుమతిస్తున్నాయి.
తత్కాల్ టికెట్ల విషయంలో టికెట్ రద్దు చేయడం సులభమే కానీ డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఇది కాస్త ఇబ్బందికర విషయం. తత్కాల్ టికెట్ల రద్దుపై కేవలం 15 రూపాయల ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని పేటీఎం ప్రకటించింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం పేర్కొంది.
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఈ సౌకర్యాన్ని గురించి తెలిపింది. తత్కాల్ సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్‌కు రిఫండ్ పొందొచ్చని పేటీఎం ప్రకటించింది. ఎవరితే పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి ఈ సదుపాయం అందిస్తున్నట్టు పేటీఎం పేర్కొంది. అయితే షరతులు వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications