తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి దర్శన కోటా విడుదల ఎప్పుడంటే!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపైన కొలువుతీరిన శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది . తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను ఈనెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం తేదీలు ఇవే
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం వరకు వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని టిటిడి సూచించింది.

Good news on the release of the february 2026 darshan quota for Tirumala Srivari temple

21న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,సేవా టికెట్ల విడుదల
ఇక నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారని టీటీడీ పేర్కొంది. ఇక అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్ ల కోటా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా అప్పుడే
24వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల కొరకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఇక 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300రూపాయల టికెట్ల కోటా విడుదలవుతుందని పేర్కొంది.

అద్దె గదుల బుకింగ్ ఎప్పుడంటే
మధ్యాహ్నం మూడు గంటలకు అద్దె గదులు బుకింగ్ కోట ఉంటుందని తెలిపింది. తిరుమలకు రావాలనుకుంటున్న భక్తులు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని పేర్కొంది. భక్తులు ఆర్జిత సేవలు, సేవా టిక్కెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని వెల్లడించింది.

భక్తులకు శ్రీవారి దర్శనం ఈజీగా.. టీటీడీ చర్యలు
ఇదిలా ఉంటే టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచటానికి కీలక చర్యలు తీసుకుంటుంది. ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలుగకుండా, దర్శనం బాగా చేసుకునేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తుంది. దర్శనం టిక్కెట్ల బుకింగ్, వసతి, మరియు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాల పైన కూడా ఎప్పటికప్పుడు భక్తులకు అప్డేట్ ఇస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+