ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏకంగా 500 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ.. అక్కడే!
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కీలక ప్రాజెక్టులను చేపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు సర్కార్ ఏపీ రాజధాని అమరావతిని ఆర్థిక రాజధానిగాను, విశాఖను ఐటీ కారిడార్ గాను, తిరుపతిని స్పోర్ట్స్ సిటీ గాను అభివృద్ధి చేస్తోంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది.
500 ఎకరాలలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం దగ్గర 500 ఎకరాలలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలతో పాటు కేంద్రం మద్దతుతో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల ఏర్పాటు పైన దృష్టి సారిస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగానే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్ర విద్యా, ఉపాధి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయం ఉంది.

జీఎంఆర్ తో చర్చలు జరిపిన మంత్రి లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో జిఎంఆర్ ప్రతినిధులతో కలిసి ఈ సిటీ ప్రతిపాదన పైన చర్చ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం లోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చేరుకున్న క్రమంలో దీనికి సమీపంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇక్కడ మాన్సాస్ ట్రస్ట్ తో పాటు ప్రభుత్వ ప్రైవేటు భూముల అందుబాటులో ఉన్నాయని వాటిని సన్నద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
చర్చల దశలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ
ఈ ఏవియేషన్ సిటీని ప్రభుత్వం జిఎంఆర్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని చూస్తోంది ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పైన ఈ నెలలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే జిఎంఆర్ సంస్థ ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని నిర్మించనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే విమానయానం, ఏరోస్పేస్. రక్షణ రంగాల శిక్షణకు దేశంలోనే ఇది ప్రధానకేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ తో ఏపీలో ఏవియేషన్ రంగం దూకుడు
ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది విమానయాన రంగంలో ఒక కీలక మార్పు తీసుకు వస్తుంది అన్న అంచనా కూడా ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ నెలలో ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగం దూసుకుపోయినట్టే.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications