ఏపీ ప్రజలకు శుభవార్త.. రేపే చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి టిడిపి, జనసేన, బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన అన్న కాంటీన్లను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. గత జగన్ సర్కార్ హయాంలో అన్న క్యాంటీన్లను మూసి వేయగా తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్లను తిరిగి పునః ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఏపీలో అన్నా క్యాంటీన్ లు
ఈ క్రమంలోనే అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ కూటమి ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్ లను నిరుపేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 230 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోగా తొలి దశలో భాగంగా 100 క్యాంటీన్ లను ప్రభుత్వం ఇదివరకే అందుబాటులోకి తీసుకువచ్చింది.

రేపు రెండో విడత అన్నా క్యాంటీన్ ల ప్రారంభం
అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం తాజాగా రెండో విడత అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి ముహూర్తం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే రేపు మరో ఈ 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్ ల ప్రారంభోత్సవంలో చంద్రబాబు
రెండో విడత అన్న కాంటీన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈసారి విశాఖ నగర పరిధిలో 25 అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో విశాఖపట్నంలో అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ప్రస్తుతం 25 క్యాంటీన్లను రేపు ప్రారంభించనున్నారు.
పేదల ఆకలి తీర్చే యజ్ఞంలో ఏపీ సర్కార్
పేద వాళ్ళ ఆకలి తీర్చే యజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమై పేదల ఆకలి తీరుస్తుంటే రేపు మరో 75 అన్న క్యాంటీన్ లను ప్రారంభించి మిగతా ప్రాంతాలలోని ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్నా క్యాంటీన్ ల విషయంలో జరిగిందిదే
గత జగన్ సర్కార్ హయాంలో అన్నా క్యాంటీన్ లను మూసివేశారు. జగన్ అధికారంలోకి రాగానే అన్ని అన్నా క్యాంటీన్ లను మూసివేశారు. కేవలం చంద్రబాబు ఈ అన్నా క్యాంటీన్ లను ప్రారంభించిన క్రమంలో వీటిని కొనసాగించటం ఇష్టం లేని జగన్ వీటిని మూసివేయించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వీటిని పునః ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నారు.












Click it and Unblock the Notifications