సాయికృష్ణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు కీలక హామీ..!!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన సాయికృష్ణ వ్యహారం లో న్యాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కోరారు. ఇప్పటికే సాయికృష్ణ వ్యవహారం మిస్టరీగా మారింది. అనేక ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. సీఐ నాగరాజు పైన ఆరోపణలు రావటం తో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. కాగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు కీలక హామీ ఇచ్చారు.

సంచలనం సృష్టించిన గడె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం పైన ముఖ్యమంత్రికి అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. సీఎం చంద్ర‌బాబును క‌లిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు .. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఐ నాగరాజు పైన ఫిర్యాదు చేసారు. ఈ మొత్తం ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశం పైన విచారణకు ఆదేశించిందని.. సీఐ ను సస్పెండ్ చేసామని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మిస్సింగ్ పై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని వెల్లడించిన చంద్రబాబు.. తప్పు చేసిన వారిని వదిలేని లేదని తేల్చి చెప్పారు. మరో వైపు ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం నియమించిన అధికారులు విచారణ మొదలు పెట్టారు.

 తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!
తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!
CM Chandra Babu Assures Sai Krishna s Family of Thorough Probe into Disappearance Custodial Death Allegations

సీఐ నాగరాజు పై కేసు.. విచారణ ప్రారంభం

కాగా.. సీఐ నాగరాజు పై న్యాయ పోరాటం చేస్తామని సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక, సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీఎన్ఎస్ సెక్ష‌న్ 101(1), 127(4), 127(6) కింద కేసులు నమోదు చేసారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంతో పాటు, క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో కూడా సీఐ వేధింపుల ప్రస్తావన రావడం వల్ల ఈ వివాదం మరింత తీవ్రమైంది.

కాగా.. ఈ కేసులో మరి కొందరు అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ ప్రాధమికంగా పూర్తి చేసిన తరువాత కీలక చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+