వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్‌న్యూస్: కరోనా రోగుల పాలిట వరం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం.. ఎలా అంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా రోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా అనుమానితులు, వైరస్ నిర్ధారణ అయిన వారిని అందజేసే చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చింది. దీంతో పేదలు, మధ్యతరగతి వారికి మేలు జరగనుంది. ఈ మేరకు ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. ప్రైవేటు ఆస్ప‌త్రులు అంతకుమించి వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. క్రిటికల్‌ కానీ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి రూ.3,250, క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా వైద్యం అందజేస్తే రోజుకి రూ.5,480 ఫీజుగా నిర్ధారించిన‌ట్లు జవహర్ రెడ్డి తెలిపారు.

 good news to ap people who want to coronavirus treatment..

ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకి రూ.5,980.. వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.9,580కి మించి చార్జ్ చేయొద్దని స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ.6,280.. ఇన్ఫెక్షన్ ఉండి వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయాలని స్పష్టంచేశారు.

Recommended Video

CBSE Syllabus నుంచి Federalism, Secularism చాప్టర్లు తొలగింపు!! || Oneindia Telugu

ఆరోగ్య శ్రీ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలోని ఆస్ప‌త్రుల‌ు ఇదే ఫీజు వ‌సూలు చేయాల‌ని స్పష్టంచేశారు. ఆరోగ్య శ్రీ కింద ట్రీట్‌మెంట్ తీసుకున్నవారికి రీయింబ‌ర్స్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. పేదలు ఎవరైనా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఉచితంగా క‌రోనా వైరస్ కోసం చికిత్స తీసుకోవచ్చని తెలిపారు.

English summary
who want to coronavirus treatment in andhra pradesh, they will join any private and govt hospital for free treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X