ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్-సర్కార్ కీలక ప్రకటన..!

ఏపీలో మందుబాబులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా నాణ్యమైన బ్రాండ్ల మద్యం దొరక్క ప్రభుత్వం ఇచ్చిన చీప్ లిక్కర్ నే మందుబాబులు భారీ రేట్లకు కొనుగోలు చేసి తాగేశారు. దీంతో అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేకుండా ప్రభుత్వం వారికి గతంలో ఉన్న పాత బ్రాండ్లతో పాటు అదనంగా మరింత నాణ్యమైన మందును అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది.

good news to drunkards in ap as all before jagan regime brands available soon in ap

గత ఐదేళ్లుగా నాసిరకం మద్యాన్ని తాగి ఆరోగ్యం పాడుచేసుకున్న మందుబాబులకు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ చెప్పారు. గత వైసీపీ సర్కార్ తరిమేసిన అన్ని పాత మద్యం బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీస్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్ తో ఆయన చర్చలు జరిపారు. ఇందులో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర.. పలు జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తిరిగి రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మందుబాబులు కోరుకునే అన్ని బ్రాండ్లను షాపుల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని గ్రెయిన్ బేస్డ్ మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. దీంతో ఐదేళ్లుగా మద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డ మందుబాబులకు భారీ ఊరట లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+